జనసేన తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారం గత రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తన వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని మోసం చేశాడని తిరుపతి మహిళ ఆరోపించడం, సెల్ఫీ వీడియో విడుదల చేయడం, ఆ తర్వాత విడుదలైన పలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన మహిళను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ వ్యవహారంపై సదరు మహిళ సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. అయితే ఈ ప్రెస్‌మీట్ ముగించుకుని బయటకు రాగానే.. రాజస్థాన్‌కు చెందిన జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన మహిళను ఆన్‌లైన్ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిసింది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు.. ప్రెస్‌క్లబ్ నుంచి ఆమె బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక ప్రెస్‌మీట్‌లో సదరు మహిళ కిరణ్ రాయల్ మీద మరిన్ని ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ మాయమాటలు నమ్మి మోసపోయానని.. ఇప్పుడు పిల్లల భవిష్యత్ కోసమే తన పోరాటమని తెలిపారు. తన వెనుక ఏ పార్టీ లేదని స్పష్టం చేశారు. కిరణ్ రాయల్ నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపించిన మహిళ.. ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు కిరణ్ రాయల్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావటంతో జనసేన పార్టీ కూడా చర్యలు చేపట్టింది. ఈ విషయమై పార్టీ అంతర్గత విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే అప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు స్పష్టం చేశారు. అలాగే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలు, నేతలకు జనసేన కీలక విజ్ఞప్తి చేసింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని సూచించింది. సమాజానికి ఉపయోగం లేని వ్యక్తిగతమైన విషయాలను పక్కనబెట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నేతలకు పపన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న పవన్ కళ్యాణ్యయ చట్టం తన పాని తాను చేస్తుందని తెలిపారు.
![]() |
![]() |