ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యవసాయ పనుల కోసం వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ.
సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు చనిపోవడంపై విచారకరమని సీఎం అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
![]() |
![]() |