రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన ఎం ప్రకాష్ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల నడుమ గొడవలు కొనసాగుతున్నాయని.
ఈ క్రమంలో ప్రకాశ్ జీవితం మీద విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు స్థానికులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |