పార్వతీపురం జిల్లా సీపీఐ కార్యదర్శి మన్మధరావు ఆదివారం తాడిపాయిలో సమవేశం నిర్వహించారు. విశాఖపట్నంలో టూరిజం సమ్మిట్లో శాసనసభస్పీకర్ అయ్యన్నపాత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
గిరిజనులకు రక్షణ చట్టంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. 12వ తేదీ జరగబోయే బంద్ కు మద్దతు ప్రకటించారు.