లింగాల మండలం కామసముద్రం గ్రామ పరిధిలో రెండు చిరుతపులులు చెరువు సమీపంలో కనిపించాయని రైతులు వాపోతున్నారు. రామాపురం గ్రామానికి చెందిన రైతు జితేందర్ రెడ్డి బైక్ పై వెళుతుండగా ఆదివారం మార్గమధ్యలో చిరుత వెంబడించినట్లు తెలిపాడు. లింగాల మండలం రామాపురం గ్రామ గుట్టలో చిరుత పులి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం అవి చిరుతలు కావని చెబుతున్నారు.
![]() |
![]() |