ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వై జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపారు. గాయపడిన యువతి వద్దకు వెళ్లి సపర్యలు చేశారు. మంచినీరు అందించి ధైర్యం చెప్పారు. అనంతరం వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
![]() |
![]() |