పలమనేరు సమీపంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల విడిది కోసం ఏర్పాటు చేస్తున్న ఎలిఫెంట్ క్యాంపును త్వరగా సిద్ధం చేయాలని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆ్‌ఫ్ ఫారెస్ట్) చిరంజీవ్ చౌదరి ఆదేశించారు. ఆదివారం ఎలిఫెంట్ క్యాంపు స్థలంలో జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఈసందర్బంగా క్యాంపు చుట్టూ అటవీప్రాంతంలో ఉన్న ఏనుగులు లోనికి రాకుండా తవ్వుతున్న కందకాలను పరిశీలించారు. ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన నీటికుంటను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మదపుటేనుగులను అదుపు చేసేందుకు నిర్మించిన క్రాల్‌ను కూడా పరిశీలించారు. క్యాంపు చుట్టూ కందకాలకు అనుబంధంగా సోలారు విద్యుత్ కంచె నిర్మాణం వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. చిత్తూరు డీఎ్‌ఫవో భరణి, పలమనేరు రేంజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
![]() |
![]() |