రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మెడికల్ సీట్లు వద్దనడం దారుణమని వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలు హేయమన్నారు. ఇది రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి తీరని నష్టమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై లోక్‌సభలో వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత పీ.వీ.మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.... ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త మెడికల్ సీట్లపై ప్రకటన చేసింది. వచ్చే 5 ఏళ్లలో దేశంలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని, ఈ ఏడాది 10 వేల సీట్లు వచ్చేలా చూస్తామని చెప్పింది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమకు కొత్త మెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసింది. ఇది చాలా దారుణం.
ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు లేవు. కరోనా సమయంలో వైద్యం కోసం రాష్ట్ర ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని మార్చడానికి ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత ఏడాదే ప్రారంభించడం జరిగింది. కానీ, ప్రభుత్వం మారడంతో, ఆ మెడికల్ కాలేజీలకు గ్రహణం పట్టింది. కాలేజీల పనులు ఆపేయడమే కాకుండా.. పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేసే పని మొదలు పెట్టారు. కేవలం గత ప్రభుత్వం వాటిని చేపట్టింది కాబట్టి, వాటిని పూర్తి చేయకపోవడం, ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం అత్యంత దారుణం అని తెలియజేసారు.
![]() |
![]() |