రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగురవేస్తామని నియోజకవర్గ ఇనచార్జ్ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అన్నారు. సోమవారం పెద్దరంగాపురంలో రాష్ట్ర కార్యుదర్శి తూగుట్ల మధుసూదనరెడ్డి, వెన్నపూస విష్ణువర్ధనరెడ్డిల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బీటెక్ రవి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన వారిలో వెన్నపూస విష్ణువర్ధనరెడ్డి, వెన్నపూస ప్రతా్‌పరెడ్డి, వెన్నపూస చిన్నప్రతా్‌పరెడ్డి, గజ్జల అంకాల్‌రెడ్డి, వెన్నపూస శివరామిరెడ్డి, మల్లేశ్వర్‌రెడ్డి, వెన్నపూస రామ్మోహనరెడ్డి, వెన్నపూస రామక్రిష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, శివకామేశ్వర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, వెలుతుర్ల రామాంజనేయులు, జగన, చంద్రశేఖర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీరెడ్డి, క్రిష్ణారెడ్డి, గంగాధర్‌రెడ్డి, ప్రదీ్‌పరెడ్డి, బారెడ్డి చలమారెడ్డి, కమలాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, అల్లిపీరా, చిలంకూరు జాన, వేణు, గౌస్, మధు, సోమశేఖర్ తదితరుల కుటుంబాలు ఉన్నాయి. కాగా స్థానిక టీడీపీ కార్యాలయంలో సీ ఎం సహాయనిధి కింద మం జూరైన రూ.14,61,000 చెక్కులను బీటెక్ రవి అందజేశారు.
![]() |
![]() |