ప్రజలు ముందస్తు చర్యలు పాటిస్తే ఫైలేరియా వ్యాధిని శాశ్వతంగా నిర్మూలన చేయవచ్చని మలేరియా విశాఖ జోనల్ అధికారిణి డా.ఎం.శాంతిప్రభ అన్నారు. బలిజిపేట పరిధిలోని మిర్తి వలస గ్రామంలో సోమవారం నిర్వహిస్తున్న ఎండీఏ కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండీఏ కార్యక్రమంలో భాంగా ప్రజలకు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆమె బలిజిపేట, పెదపెంకి, వంతరాం గ్రామాల్లో అమలవుతున్న ఎండీఏ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆమె వెంట జోనల్ ఆఫీసర్ ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరావు, వైద్య సిబ్బంది ఉన్నారు.