తంబళ్లపల్లె నియోజకవర్గం లో పారి శ్రామిక కారిడర్లను ఏర్పాటు చేసి నిరు ద్యోగ సమస్యను తీర్చాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి మంత్రి టీజీ భరతను కోరారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో పర్యటించిన పరిశ్రమల, వాణిజ్య, ఆహార శుద్ధిశాఖా మంత్రి టీజీ భరతను సోమవారం మరో మంత్రి రాంప్రపాద్‌రెడ్డి అధ్వర్యం లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం మండలంలో సోలార్ సిటీ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని,వివరించారు. ఆసియాలోనే ములక లచెరువు టమోటా మార్కెట్ క్రయ, విక్రయాల్లో మొదటి స్ధానంలో ఉందని ఇక్కడ టమోటా, ఫుట్ ప్రాసెసింగ్, వ్యవ సాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అనంతరం మం త్రితో తంబళ్లపల్లె నియోజకవర్గ సమస్యలపై చర్చించి వినతి పత్రాలు అందజేశారు.
![]() |
![]() |