రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పేర్ని జయసుధకు నోటీసులు అందజేయాల్సి ఉందని, విచారణను వాయిదా వేయాలని పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.
![]() |
![]() |