గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు.
గార మండలం కుమ్మరిపేట, గార, కర్ణలపేట గ్రామాల్లో మంగళవారం అయన పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను పరిశీలించారు.
![]() |
![]() |