చీరాల మండలం గవినివారిపాలెం, బుర్లవారిపాలెం, దేవినూతల గ్రామాల వరకు ఉన్న రైతుల పొలాల్లో రోడ్డు విస్తరణ పేరుతో ముప్పై అడుగులకు కుదించారు. వాస్తవంగా ఈ రోడ్డు 90 అడుగులుగా ఉండేది. ఓడరేవు - పిడుగురాళ్ల నేషనల్ హైవే కూడా ఇటువైపు నుండే వస్తుంది.
కానీ కొంతమంది అక్రమ లేఔట్లు, వెంచర్లు వేసి పంట కాల్వ, రోడ్డును మూసివేసి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని చీరాల తహసీల్దార్ గోపికృష్ణ కు మంగళవారం మాజీ ఎంపీపీ శ్రీనివాసులు వినతి పత్రాన్ని అందజేశారు.
![]() |
![]() |