AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కొనాం ప్రసాద్(30) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులో పడేశారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ప్రసాద్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడు. ఘటనా స్థలాన్ని డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. హత్య జరిగిన తీరు, దీనికి గల కారణాలపై వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? ఈ ఘటనకు అదే కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |