అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.... మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి.ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. అరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో సోమవారం రెండు ప్రైవేట్ జెట్‌లు ఢీకొన్నాయి. ఆరిజోనాలోని స్కాట్స్‌డేల్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రైవేటు ప్రాపర్టీలో పార్కింగ్ చేసిన మీడియం సైజు బిజినెస్ జెట్‌ను మరో విమానం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.స్కాట్స్‌డేల్ అగ్నిమాపక విభాగం కెప్టెన్ డేవ్ ఫోలియో మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడినట్టుగా చెప్పారు. వారిలో ఇద్దరిని ఆసుపత్రి ట్రామా సెంటర్లకు తరలించగా, మరొకరి పరిస్థితి ఆసుపత్రిలో స్థిరంగా ఉందని చెప్పారు. ఒక వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా చెప్పారు.
స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు లియర్‌జెట్ 35A విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వేపై నుంచి దూసుకెళ్లి ఆగి ఉన్న గల్ఫ్‌స్ట్రీమ్ 200ను ఢీకొట్టిందని యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫీనిక్స్ డౌన్‌టౌన్ నుండి దాదాపు 20 మైళ్ల దూరంలో ఉన్న విమానాశ్రయంలో, దర్యాప్తు అధికారులు సంఘటనా స్థలాన్ని అంచనా వేస్తున్నందున విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.అమెరికాలో గత రెండు వారాలుగా వరుస విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. జనవరి 29 రాత్రి అమెరికన్ ఈగిల్ పతాకంపై ఎగురుతున్న ప్రాంతీయ జెట్ విమానం, రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయంలో రన్‌వే వద్దకు చేరుకుంటుండగా, ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాల్లోనే ఢీకొట్టడంతో 67 మంది మరణించారు.
![]() |
![]() |