కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్‌లోని వాటాల బదలాయింపు చట్టనిబంధనల ప్రకారమే జరిగిందని విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. విక్రాంత్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరి బంధువు కావడంతోనే రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారని తెలిపారు. విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు ముగియడంతో సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనల కోసం విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.