గత 5 ఏళ్లలో చిన్న రాష్ట్రం అవ్వడం, సంఖ్యాపరంగా తక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల ఏపీ ప్రయోజనాల పట్ల కేంద్రం అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని గొల్ల బాబూరావు అన్నారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పూర్తిగా మన రాష్ట్రానికి చెందిన ఎంపీల బలంమీదే ఆధారపడి ఉంది అని తెలిపారు. ఈ సందర్బాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు కృషి చేయాలి అని తెలిపారు. ఈ సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయడం తగదు. బీహార్‌కు ఇస్తున్న ప్రాధాన్యతతో చూస్తే ఏపీని కేంద్రం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్ సభల్లో మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీకి చెందిన వారే దానిని వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికే నష్టం జరుగుతుందని గ్రహించాలి అని అన్నారు.
![]() |
![]() |