రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కూటమి పార్టీ ఎంపీలు నిమ్మకునీరెత్తనట్లు పార్లమెంట్ లో మోనం పాటిస్తున్నారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు పోలవరం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేస్తే, చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను కుదించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. దీనిని పార్లమెంట్ లో నిలదీశాం.
ఒకవైపు చంద్రబాబు బనకచర్ల గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. పోలవరంలో నీటి సామర్థ్యం తగ్గిపోతే బనకచర్ల, ఉత్తరాంధ్ర సజల స్రవంతికి నీటిని ఎలా అందిస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలి. రాష్ట్రానికి చెందిన కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిసారీ తెలుగుదేశం ఎంపీలు మమ్మల్ని అడ్డుకున్నారు. వారి వైఖరి వల్ల రాష్ట్రం అన్యాయమైపోతోంది అని ఆవేదన వ్యక్తపరిచారు.