ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం వద్ద సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల కోసం పోలీసు అధికారులు మంగళవారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నర్సీపట్నం డిఎస్పి పోతిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకుని సముద్ర స్నానాలు చేసే భక్తుల రక్షణకు గజఈతగాళ్లను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య ఈ సంవత్సరం బాగా పెరిగింది. స్థానికులు సైతం భక్తులకు సహకారం అందిస్తున్నారు.
![]() |
![]() |