రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాట తీస్తానని అన్నారు. కిరణ్ రాయల్ తాట ఎప్పుడు తీస్తారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతలు చేస్తున్న దారుణాలపై వరుదు కళ్యాణి బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రతి రోజు మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. జనసేన నేత కిరణ్ రాయల్ వల్ల లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగింది. లక్ష్మికి న్యాయం జరిగిందా. మహిళకు అన్యాయం జరిగితే తాట తీస్తామని పవన్ చెప్పారు. లక్ష్మి అనే మహిళకు అన్యాయం జరిగితే ఏమి చేశారు. తిరిగి బాధితులు మీద కేసులు పెడుతున్నారు.`టీడీపీ ఎమ్మెల్యే అదిమూలం మహిళను వేధిస్తే పక్క రాష్ట్రం వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరో ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ ఎమ్మెల్యేలపై కూటమి ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టడం లేదు. మహిళలు తమ మానాలను పణంగా పెడితేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హోం మంత్రి జిల్లాలో మహిళకు రక్షణ లేదు. సీఎం చంద్రబాబు మహిళా రక్షణ కోసం కనీసం ఒక సమీక్ష నిర్వహించారా?ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని మీ సొంత సర్వేలోనే తేలింది’ అని వ్యాఖ్యానించారు.
![]() |
![]() |