గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్ టిక్కెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. గురువారం నుంచి అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23న ఉదయం, మధ్యాహ్నం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాలకు హాల్ టిక్కెట్లు మాత్రమే తీసుకురావాలని ఏపీపీఎస్సీ స్పష్టంచేసింది.