AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటు మరో ఐదుగురిపైన కేసు నమోదైంది. సత్యవర్ధన్‌ను పోలీసులు విచారించగా.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు వంశీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |