వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. వల్లభనేని వంశీ అరెస్టుపై మాజీ మంత్రి బొత్స రియాక్ట్ అయ్యారు. కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారన్నారు. అరెస్టులపై ఉన్న ఫోకస్, పాలనపై పెడితే బాగుంటుందన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయండి.. చట్ట పరంగా మేం పోరాటం చేస్తామన్నారు. మరో నాలుగేళ్లు పోయిన తర్వాత మీ విధానంపై మాట్లాడుదామన్నారు. నిన్నటికి నిన్న హైకోర్టు సైతం పోలీసు వ్యవస్థపై మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే ప్రభుత్వానికి బాధ అనిపించలేదా అంటూ ప్రశ్నించారు.
వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేత పట్టాభి రియాక్ట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర స్థాయి బీసీ నాయకుడు దొంతు చిన్నపై వంశీ అనుచరులు దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారన్నారు. ఆయనను తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించామన్నారు. తాను గన్నవరం వెళ్తున్న సమయంలో వంశీ ఆఫీసు బయట దాదాపు వందల సంఖ్యలో ఆయన అనుచరులు ఉన్నారని వివరించారు.
![]() |
![]() |