ప్రజాసమస్యల పరిష్కారం కోసం ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ జనవరి 28న ఒంగోలు 37వ డివిజన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. అసంపూర్తిగా ఉన్న సిమెంట్ రోడ్ల పనులను బుధవారం రూ.10లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టారు. రూ.10కోట్లతో డివిజన్‌లోని సమస్యలు పరిష్కారిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే డివిజన్‌లో దోమల నియంత్రణకు చర్యలు తీసుకోగా, పారిశుధ్యం మెరుగునకు, ఎన్టీఆర్ పార్కులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పార్కు నుంచి మంగమూరు డొంకకు గతంలో కొద్దిదూరం వేసి వదిలేసిన సీసీ రోడ్డును పూర్తిచేసే పనులను బుధవారం ప్రారంభించారు.
![]() |
![]() |