ఉపాధి హామీ పథకం సిబ్బందికి సంబంధించి సొసైటీ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ సర్వీ్‌స(ఎ్‌సఆర్‌డీఎస్) నిబంధనలను సవరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ యోచిస్తోంది. తప్పు చేయని వారిపై చర్యలు తీసుకోకుండా.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగితే.. ఏ కేటగిరి సిబ్బందికి ఏ విధమైన జవాబుదారీతనం ఉండాలన్న దానిపై ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నారు.
2008లో రూపొందించిన రూల్స్ చాలా వరకు కాలం చెల్లినవే! సోషల్ ఆడిట్ తర్వాత వీటిని పాటించడం ద్వారా.. అవినీతికి పాల్పడకపోయినా చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు! ఈ నేపథ్యంలో సిబ్బంది జాబ్‌చార్ట్‌పై మరింత స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలను మార్పుచేసేందుకు జిల్లాల డ్వామా పీడీల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. కమిషనర్ కృష్ణతేజ గురు, శుక్రవారాల్లో విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశాల్లోనే డ్వామా పీడీల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముక్‌కుమార్ నిర్ణయించారు. ఎస్‌ఆర్‌డీఎస్ మార్గదర్శకాల్లో లోపాలను సరిదిద్ది వచ్చే ఎస్‌ఆర్‌డీఎస్ బోర్డు సమావేశంలో సవరణలు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |