మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మనవడు యిమ్మణ్ణి విష్ణు వివాహ రిసెప్షన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరై వధూవరులను దీవించారు. ఈ సందర్భంగా ఆయన్ను మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, జి.శ్రీనివాస్ నాయుడు, పలువురు జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
![]() |
![]() |