గాజులరామారం చిత్తారమ్మ దేవి దేవాలయంలోని రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి రజతోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రేణుక ఎల్లమ్మ తల్లి దయ, కరుణాకటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, మూసా ఖాన్, తారా సింగ్, తెలంగాణ సాయి, సుంకరి చందు, విజయ్, శ్రీశైలం, ప్రసాద్, జగద్గిరిగుట్ట శ్రీ వేంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |