AP: కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్ కడప జిల్లా పేరు మార్పు పై X ద్వారా సంచలన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని వ్యాఖ్యానించారు. అనాడు జగన్ చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారని, వైఎస్‌ఆర్ జిల్లా పేరును వైఎస్‌ఆర్ కడప జిల్లాగా మార్చి అనేక మంది ప్రజల హృదయాలను గాయపరిచారని పేర్కొన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా పేరును మర్చిన విషయం తెలిసిందే.
![]() |
![]() |