కురబలకోట మండలం ముదివేడు దండు మారమ్మ తిరణాల సందర్భంగా చాందినీ బండ్లకు పోలీసుల వద్ద ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంగళవారం ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రశాంతంగా ఊరేగింపు సాగించేందుకు వలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రికార్డు డ్యాన్సులు నిర్వహించరాదని హెచ్చరించారు. నిర్దేశించిన సమయం వరకే మైక్ సెట్ లు ఉపయోగించాలని సూచించారు. నియమ నిబంధనలు పాటించాలన్నారు.
![]() |
![]() |