ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్.., అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కొడలితో డేటింగ్ వార్తలపై స్పందించారు. జూనియర్ ట్రంప్ భార్య వన్నెసా ట్రంప్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు వుడ్స్ తాజాగా ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘మా ప్రేమ గాలిలో ఉంది. జీవితంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది... మా జీవిత ప్రయాణం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం... ఈ సమయంలో మా శ్రేయాభిలాషుల నుంచి మరింత గోప్యతను ఆశిస్తున్నాం.. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి... ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు వారి జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది... తమ జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని అనుకుంటున్నాం’ అని వుడ్స్ ఎక్స్‌లో వెన్నెసాతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
టైగర్ వుడ్స్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మాజీ భార్య వనెస్సా ట్రంప్‌తో కలిసి శాన్ డియాగోలోని టోరీ పైన్స్‌లో తొలిసారి కనిపించారు. తన కుమార్తె కైతో కలిసి జెనెసిస్ ఇన్విటేషనల్ గోల్ఫ్ టోర్నీ ముగింపునకు వచ్చినప్పుడు వుడ్స్, వన్నెసా మొదటిసారి కలిశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. సహజీవనానికి దారితీసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ వారం బెంజిమిన్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి వుడ్స్ పిల్లలు శామ్, చార్లీతో కలిసి ట్రంప్ మనవరాలు కై హాజరైంది. దీంతో వుడ్స్, వన్నెసా రిలేషన్‌షిప్ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా, వుడ్స్ దీనిని అధికారికంగా ధ్రువీకరించారు.
డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో వెన్నెసాకు 12 ఏళ్ల కిందట వివాహం కాగా.. ఈ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాగా, టైగర్ వుడ్స్ తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచుతారు. కానీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ.. వన్నేశాతో తన సంబంధాన్ని బహిరంగంగా ధ్రువీకరించారు. 2013లో లిండ్సే వాన్తో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్న వుడ్స్.. అప్పుడు ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. తన పిల్లల భద్రత గురించి ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు.
కాగా, పలువురి మహిళలతో తన భర్త వివాహేతర సంబంధాలు వెలుగులోకి రావడంతో భార్య ఎలిన్ నొర్డెగ్రెన్.. 2010లో వుడ్స్ నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత ఎరికా హెర్మన్‌తో ఏడేళ్ల పాటు సహజీవనం చేశారు. ఈ జంట 2022లో విడిపోయింది. అయితే, ఈ సమయంలో వివాదం తలెత్తడంతో కోర్టుల్లో కూడా వ్యాజ్యాలు నడిచాయి. చివరకు ఇరువురీ రాజీకి రావడంతో వివాదం ముగిసింది.
![]() |
![]() |