అనంతపురం జిల్లా, పాపరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్షసాధింపు వల్లే వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యకు గురయ్యాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యపై మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. పరిటాల సునీత డైరెక్షన్‌లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సహాంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తుండటం చూస్తుంటే, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం ఎంతగా దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతోందిన అన్నారు. అయన మాట్లాడుతూ.... అనంతపురం జిల్లా రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి పదవి దక్కకూడదని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌లు లు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. టీడీపీకి ఒకరు, వైయస్‌ఆర్‌సీపీకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉండటంతో ఎంపీపీ పదవి సాధారణంగానే వైయస్‌ఆర్‌సీపీకి దక్కుతుంది. అయితే పరిటాల సునీత ఆదేశాలతో టీడీపీ గుండాలు ఉప ఎన్నికకు ముందు నుంచే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలను బెదిరించడం, వారి బంధువులను వేధించడం చేశారు. కోర్ట్ ఆదేశాలతో పోలీస్ భద్రత మధ్య మార్చి 27న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక కోసం రామగిరి మండల పరిషత్ కార్యాలయంకు వస్తుంటే స్థానిక ఎస్ఐ సుధాకర్ తన ఫోన్ నుంచి పరిటాల సునీత, శ్రీరామ్‌లకు వీడియో కాల్ చేసి, ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేశారు. తరువాత ఎన్నిక సమయానికి ఎంపీటీసీలు హాజరుకాలేకపోయారని అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తే, వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను ఇదే ఎస్ఐ సుధాకర్ ఎమ్మార్వో కార్యాలయంకు తీసుకువెళ్ళి బైండోవర్ చేయించాడు. అక్కడికి టీడీపీ గుండాలను తీసుకువచ్చి, వారితో ఎంపీటీసీలను కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునేందుకు మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్‌తో కలసి ధర్నా చేసినందుకు నాతో పాటు మొత్తం 26 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు అని తెలిపారు.
![]() |
![]() |