పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. పింఛన్లు పంపిణీ ద్వారా ప్రజల జీవితాలలో సంతోషం తెస్తున్నామని, సంక్షేమ పథకాల లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు.
![]() |
![]() |