అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నేపథ్యంలో అలేఖ్య అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరింది. ఈ క్రమంలో అలేఖ్య చెల్లి రమ్య ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. 'మా అక్క అలేఖ్య చిట్టి తాను చేసిన తప్పుకు పబ్లిక్‌గా అందరికీ క్షమాపణలు చెప్పింది. దాన్ని కూడా మీమర్స్, యూట్యూబర్స్ నెగెటివ్ గా స్ప్రెడ్ చేశారు. ఒక ఆడపిల్లను ఎందుకు ఇంతగా టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు. మా అక్కకి ఏదైనా జరిగితే మీరు బాధ్యత వాహిస్తారా' అంటూ ప్రశ్నించింది.తమ చావు తప్ప మరొక దిక్కు లేదని, ప్రతి రోజు కొంత మంది యూట్యూబర్లు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా (న్యూస్ ఛానల్స్) రెండేసి వీడియోలు చొప్పున చేస్తున్నారని, తమను టార్గెట్ చేశారని సుమ కంచర్ల కన్నీళ్లు పెట్టుకున్నారు. చావు తప్ప మరొక దిక్కు లేదంటూ ఆవిడ తీవ్ర వేదనకు లోను అయ్యారు. మూడు నెలల క్రితం తమ తండ్రి మరణించారని, ఇప్పుడు మరొక చావును తట్టుకునే శక్తి తమ కుటుంబానికి లేదని, ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని తాము కోరుకుంటున్నట్లు ఆవిడ తెలిపారు. క్షమించలేని తప్పు ఏది ఉండదని, చావుకు మించిన పెద్ద తప్పు ఏముంటుందని ఆవిడ ప్రశ్నించారు.
![]() |
![]() |