రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ Realme 14T 5Gను ఏప్రిల్ 25న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫోన్ ధర స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అదే రోజున జరిగే లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు. టెక్ ప్రియులు ఈ ఫోన్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఫోటోగ్రఫీ కోసం రియల్‌మీ 14T 5G లో 50MP AI కెమెరా ఉంటుంది. శబ్ద అనుభూతిని మెరుగుపరచేందుకు 300% Ultra Volume Mode అందించబడింది. ఇది సాధారణ వాల్యూమ్ కంటే మూడింతలు ఎక్కువ శబ్ద సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ రియల్‌మీ, ఫ్లిప్ కార్ట్ అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. ధర, ఇతర వివరాలు ఏప్రిల్ 25న జరగనున్న లాంచ్ ఈవెంట్ లో అధికారికంగా వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa