మనం ఉపయోగించే ప్రతి క్రెడిట్/డెబిట్ కార్డుపై MM/YY ఫార్మాట్ గడువు తేదీ ముద్రించబడి ఉంటుంది. గడువుతేదీ ఎప్పటికప్పుడు కొత్త భద్రతా లక్షణాలను తీసుకువస్తుంది. దీంతో హ్యాకర్లు కార్డ్ వివరాలను చోరీ చేయడం కష్టతరం అవుతుంది. అలాగే కార్డు వెనుకవైపు CVV (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) అని పిలువబడే మూడంకెల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఆన్‌లైన్ లావాదేవీలలో కార్డు భౌతిక ఉనికి ధృవీకరిస్తుంది.క్రెడిట్ కార్డు వెనుక భాగంలో CVV (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) లేదా CVC (కార్డ్ వెరిఫికేషన్ కోడ్) అని పిలువబడే మూడు అంకెల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ఆన్‌లైన్ లావాదేవీలలో కార్డు భౌతిక ఉనికిని ధృవీకరిస్తుంది.CVV కార్డు మాగ్నెటిక్ స్ట్రిప్ లేదా చిప్‌లో నిల్వ చేయలేరు. అందువల్ల దానిని దొంగిలించడం కష్టం. అందుకే ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో CVV తప్పనిసరి అని అడుగుతారు. తద్వారా సైబర్ నేరస్థుడు ఆన్‌లైన్ వివరాలను దొంగిలిస్తే, అతనికి CVV తెలియకుండా ఉంటుంది.
![]() |
![]() |