ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఐసెట్ (AP ICET) 2025 ఫలితాలు మంగళవారం (మే 21) సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ నెల 7వ తేదీన జరిగిన ఐసెట్ పరీక్షను రెండు సెషన్లలో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,131 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షపై విద్యార్థుల్లో విశేష ఆసక్తి కనిపించింది.
ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
ఫలితాల లింక్: https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa