ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై దర్యాప్తులో భాగంగా ఈడీ గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న తమ ముందు హాజరు కావాలని సమన్లు పంపింది. ఈ రెండు కంపెనీలు వెబ్సైట్లలో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయని పేర్కొంది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం ద్వారా అక్రమ కార్యకలాపాలకు సహకరిస్తున్నారంటూ మనీలాండరింగ్, హవాలా కేసులో ఈడీ ఆరోపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa