పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రచారంలో నిమగ్నమై సొంతూరు తుమ్మలపల్లిలో వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఈ విషయాన్ని గ్రహించడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఉపఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పులివెందులలో 74.57శాతం ఓటింగ్ నమోదవ్వగా.. ఒంటిమిట్టలో 70శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa