ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం తెచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. నిన్న పార్లమెంటు ఉభయసభలు మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించగా, ఇప్పుడు అది చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుతో గేమింగ్ యాప్‌లపై పారదర్శకత పెరిగి, వినియోగదారుల రక్షణకు దోహదం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇకపై డబ్బు ఆధారిత ఆటలు నిర్వహించే సర్వీస్ ప్రొవైడర్స్, అడ్వర్టైజర్లు, ఫైనాన్షియర్లపై కఠిన శిక్షలు ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa