ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు సన్నగానే ఉన్న బ్యాక్ ఫ్యాట్ పెరిగి లావుగా కనిపిస్తున్నారా, ,,,అయితే ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 09:37 PM

మనలో చాలా మంది డెస్క్ జాబ్స్ చేస్తుంటారు. దీంతో ఎక్కువటైమ్ కూర్చునే ఉంటున్నారు. ఇది రెస్ట్‌గా అనిపించినప్పటికీ దీని వల్ల లోయర్ బ్యాక్, బ్యాక్ ఇలా వెనుక భాగంలో ఫ్యాట్ పెరిగిపోయి చూడ్డానికి లావుగా మారిపోతున్నారు. ఈ ఫ్యాట్ కరిగించాలంటే ఎక్కువ శ్రమపడాలని కొంతమంది భయపడుతుంటారు. అలా కాకుండా నేచురల్‌గానే బ్యాక్ ఫ్యాట్ కరిగి మనం ఫిట్‌గా మారాలంటే కొన్ని ఎక్సర్‌సైజెస్ హెల్ప్ చేస్తుంది. దీంతో వెన్నులోని ఫ్యాట్ తగ్గుతుంది. లోయర్ బ్యాక్‌లోని ఫ్యాట్ తగ్గుతుంది. మీ పోశ్చర్ కూడా చక్కగా టోన్ అవుతుంది. ఇవి చాలా వరకూ ఇంట్లోనే కూడా చేయొచ్చు. కొన్ని స్ట్రెచెస్‌తో వీపు నడుము భాగం తగ్గుతుంది. కేలరీలు బర్న్ అవుతాయి. పోశ్చర్ మెరుగ్గా అవుతుంది. బ్యాక్‌ ఫ్యాట్ చాలా వరకూ తగ్గుతుంది.


డంబెల్ బెంట్ ఓవర్ రో


దీనిని చేయడం వల్ల కూడా చాలా ఒంట్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరగడానికి హెల్ప్ అవుతుంది. దీనిని ఎలా చేయాలంటే పాదాలను తుంటి వెడల్పు వరకూ ఉంచి ముందుకి వంగాలి. సపోర్ట్ కోసం ఓ చేయిని బెంచ్ లేదా మోకాలిపై ఉంచండి. మోచేయిని దగ్గరగా ఉంచాలి. డంబెల్‌ని మీ నడుమువైపుకి లాగండి. మెల్లిగా రండి. మరోవైపు ఇలానే చేయండి. వారానికి రెండుసార్లు ఈ వర్కౌట్ చేయండి.


రివర్స్ ఫ్లై


ఈజీగానే చేసే ఈ వర్కౌట్‌తో బ్యాక్ ఫ్యాట్ తగ్గుతుంది. దీనిని ఎలా చేయాలంటే పాదాలను భుజం వెడల్పుతో వేరుగా ఉంచాలి. తుంటి వద్ద ముందుకు కీలు ఉంచి మోకాలు కొద్దిగా వంచాలి. మీరు లిఫ్ట్ చేయగలిగేంత వెయిట్‌లో డంబెల్స్ పట్టుకోండి. చేతులు క్రిందకి తీసుకొచ్చి చేతులని మెల్లికి రెండువైపులా ఎత్తండి. నెమ్మదిగా తిరిగి తీసుకురండి. వారానికి రెండుసార్లు ఇలా చేయండి. దీంతో వీపు భాగంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరిగిపోతుంది.


లాట్ పుల్ డౌన్


ఇది కూడా జిమ్‌లో చేసే వర్కౌట్. జిమ్‌లో బార్‌ని చేతులతో పట్టుకోండి. ఛాతీవైపుకి క్రిందకి లాగండి. లాట్‌ని గట్టిగా నొక్కి మెల్లిగా వదిలేయండి. ఇలా లాట్ పుల్ అప్స్ చేయండి. వారానికి 1 నుంచి 2 సార్లు రోయింగ్ వర్కౌట్స్‌తో ఈ వర్కౌట్ చేయండి. అయితే, మీరు ఎలా పడితే అలా చేయొద్దు, మీరు లిఫ్ట్ చేయగలిగేలంత వెయిట్ మాత్రమే లిఫ్ట్ చేయాలి. లేదంటే భుజాలు పట్టేయడం, నొప్పులు రావడం జరుగుతుంది.


బ్యాక్ ఎక్స్‌టెన్షన్


ఈ వర్కౌట్ చేయడం వల్ల బ్యాక్ ఫ్యాట్ కూడా చాలా వరకూ తగ్గుతుంది. తుంటికి సపోర్ట్ చేస్తూ చేతుల్ని తలపై ఉంచి చేయాలి. మెల్లిగా అప్పర్‌బాడీని కిందకి తీసుకోరండి.ఈ వర్కౌట్‌లో పిరుదులు, నడుము మజిల్స్ నిమగ్నం అవుతాయి. ఛాతీని కొద్దిగా ఎత్తి కిందకి రండి. వారానికి రెండు నుంచి 3 సార్లు చేయొచ్చు. దీని వల్ల లోయర్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. పోశ్చర్ మెరుగ్గా మారుతుంది. అయితే, ఇది జిమ్‌లో ఎఫెక్టివ్‌గా చేయొచ్చు.


బర్డ్ డాగ్


ఈ వర్కౌట్ ఇంట్లోనూ కూడా చేయొచ్చు. నాలుగు కాళ్ళపై కుడి కాలుని, ఎడమ చేయిని చాచండి. ఇలా ఉండగలిగేంతసేపు ఉండి తిరిగి యథస్థానానికి రావాలి. తర్వాత కుడి చేయిని చాచి ఎడమ కాలుతో కూడా ఈ పోజ్ చేయొచ్చు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నడుము స్ట్రెచ్ అవుతుంది. నడుము నొప్పి తగ్గుతుంది.


ఇన్వర్టెడ్ రో


నడుము ఎత్తులో బార్‌ని సెట్ చేయండి. బాడీ స్ట్రెయిట్‌గా ఉండేలా కిందపడుకుని, మడమలని నేలపై ఉంచండి. ఛాతీని బార్‌వైపుకి లాగండి. మీ బాడీని స్ట్రాంగ్‌గా ఉంచండి. నెమ్మదిగా తగ్గించండి. వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా చేయండి. దీని వల్ల చాలా వరకూ మంచి ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాక్‌లో పేరుకుపోయిన ఫ్యాట్ తగ్గుతుంది. జిమ్‌లో చేసే వర్కౌట్స్ గురించి చాలా మందికి తెలుసు. కానీ, వాటి వల్ల కలిగే లాభాలు ఎక్కువగా తెలుసు. అలాంటప్పుడు ఓ సారి ట్రైనర్‌ని ఎలా చేయాలి, చేస్తే ఏ లాభాలుంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa