ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు వాడే కొబ్బరినూనె మంచిదా, కాదా తెలియట్లేదా

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 10:36 PM

మార్కెట్లో ప్రతీ వస్తువుని కల్తీ చేసేస్తున్నట్లుగానే నేడు కొబ్బరినూనెని కూడా కల్తీ చేస్తున్నారు కల్తీ రాయుళ్ళు. దీని వల్ల అసలైన నూనె ఏదో, కల్తీ ఆయిల్ ఏదో తెలియక చాలా మంది కంగారుపడుతున్నారు. ఇన్ని రోజులుగా కేవలం మసాలా పదార్థాలని మాత్రమే కల్తీ చేసేవారు. కానీ, నేడు ఎక్కువగా అమ్ముడుపోతున్న కొబ్బరినూనెని కూడా కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని ఎలా గుర్తించాలో ముందుగానే తెలుసుకోవడం మంచిది. ముందుగానే దీని స్వచ్ఛతని ఇంట్లోనే గుర్తించొచ్చు. చిన్న చిన్న టెస్టులతోనే అసలైన కొబ్బరినూనె ఏదో నకిలీ కొబ్బరినూనె ఏదో క్షణాల్లో చెప్పేయొచ్చు. మరి ఆ సింపుల్ టెస్ట్స్ ఏంటో తెలుసుకోండి.


వేడి చేయడం


కొబ్బరినూనెని వేడి చేసి దాని స్వచ్ఛతని గుర్తించొచ్చు. దీనికోసం మీడియం మంటపై పాన్‌ పెట్టి వేడి చేయాలి. అందులో కొబ్బరినూనె వేయాలి. సిమ్‌లోనే వేడి చేయాలి. ఇలా సిమ్‌లోనే మరిగిస్తే కాలిన వస్తే అది మంచి కొబ్బరినూనె కాదని గుర్తించాలి. అలా కాకుండా మంచి కొబ్బరినూనెలా వాసన వస్తే అసలైనదిగా గుర్తించాలి. దీనికోసం కొద్దిగా కొబ్బరినూనెని వేడిచేస్తే సరిపోతుంది.


ఫ్రిజ్‌లో పెట్టి


ఓ సీసాలో కొద్దిగా కొబ్బరినూనె తీసుకోవాలి. దీనిని ఓ గంటపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. అది కల్తీ నూనె అయితే గడ్డకట్టిన తర్వాత కూడా మరో పొరలా పైకి తేలుతుంది. లేదా మొత్తంగా గడ్డ కడుతుంది. కాబట్టి, ఈ టెస్ట్‌తో కూడా ఈజీగా కొబ్బరినూనె ప్యూరిటీని చెక్ చేయొచ్చు. దీంతో క్షణాల్లోనే గుర్తించేయొచ్చు.


ఫ్రీజింగ్ టెస్ట్


ఇదో మరో సింపుల్ టెస్ట్. దీనికోసం మీరు ఓ గ్లాసుని నిండుగా నీటితో నింపండి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెని కలపండి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలానే ఉంచండి. నూనె ఘనీభవిస్తుందా లేదా కరుగుతుందో చూడండి. నూనె నీటిలో కరిగిపోతే నకిలీది అని, ఘనీభవిస్తే మాత్రం స్వచ్ఛమైన కొబ్బరినూనెగా గుర్తించాలి.


వాసన, రుచి


దీని కోసం మీ ముక్కు, నోటికి పనిచెప్పాల్సిందే. దీనికోసం మీరు నూనె వాసనని చూడండి. మంచి స్మెల్ వస్తే కల్తీ లేదని. కొబ్బరినూనె తాజాగా వస్తే మంచి కొబ్బరినూనెగా గుర్తించాలి. అలా కాకుండా ఘాటైన, మాయిశ్చరైజర్ వాసన వస్తే మంచిది కాదని గుర్తించాలి. అక్కడితో ఆపాలనుకుంటే అపేయొచ్చు. లేదంటే మీరు కొద్దిగా నోటిలో కూడా వేయొచ్చు. అది రుచిగా తియ్యగా ఉంటే అది మంచి నూనెగా గుర్తించాలి. చేదుగా ఉంటే జిడ్డుగా ఉంటే కల్తీ నూనెగా గుర్తించాలి.


రంగు


రెగ్యులర్‌గా కొబ్బరినూనె తెల్లగా ఉంటుంది. కల్తీ జరిగితే కాస్తా పసుపు రంగులో ఉంటుంది. అదే విధంగా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే అందులో కొద్దిగా మలినాలు ఉంటాయి. కాస్తా జిడ్డుగా ఉంటుంది. మరీ ఎక్కువగా జిడ్డుగా ఉండదు. అందులో కల్తీ ఉంటే మరీ ఎక్కువగా జిడ్డు ఉంటుంది. ​గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి తెలుగు సమయం బాధ్యత వహించదు.​​






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa