రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలోకి నవంబర్ 23న ప్రవేశించనున్నాడు. ఈ గ్రహ సంచారం 2026 ఆగస్టు 2 వరకు కొనసాగుతుంది. దీనివల్ల మేష, మిథున, కర్కాటక, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి ఇది అత్యంత శుభప్రదంగా ఉండనుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ఆదాయం పెరుగుదల, కోల్పోయిన డబ్బు తిరిగి రావడం, ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. ప్రేమ, వివాహ వ్యవహారాలు కూడా కలసి వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa