మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో ఫలితంశ ములు గమనించగా విద్యా పరమైన విషయాలు ముఖ్యంగా ఉన్నత విద్య, అనుకూలంగా ఉంటాయి, కుటుంబం, కుటుంబ పరిస్థితులు, తల్లి యొక్క ఆరోగ్యం, పెద్దలకి సౌకర్యాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, వృత్తిపరంగా కృషి అధికం బాధ్యతలు పెరుగుతాయి, వృత్తి పరమైన ప్రదేశాలలో ముఖ్యమైన ఏర్పాట్లు కొరకు శ్రమ, పెద్దలను కలుస్తారు. అభివృద్ధికరంగా ముందుకు సాగుతారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. వారం చివరిలో ఆశించిన ఫలితాలు సంతానము కొరకు ఖర్చులు. సంతానము యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మిక విషయాలు ఆనందాన్నిస్తాయి ,మిత్రుల తో ప్రయోజనకరంగా ఉంటాయి, చిన్ననాటి పరిచయాల నుండి మంచి వర్తమానాలు అందుకుంటారు, అభివృద్ధి, ఆర్థిక లాభం, ఆకస్మిక అవకాశాలు. మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మంచిది.
వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
వారం ప్రారంభంలో ఫలితాంశములు గమనించగా భాగస్వామ్య వ్యవహారాల గురించి గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆందోళనను, వత్తిడి అధిగమించాలి. కొత్త అగ్రిమెంట్స్ సైన్ చేసేటప్పుడు, వారసత్వపు ఆస్తులు, ఆకస్మిక ఖర్చులు మొదలైన విషయాలలో స్నేహ సంబంధాల విషయంలోనూ ప్రయాణాలలోనూ, నూతన పరిచయాలలోనూ, మధ్యవర్తిత్వంలోనూ, హడావిడి నిర్ణయాలని అధిగమిస్తూ ముందుకు వెళ్లాలి. ముఖ్య ప్రయాణాలు, అగ్రిమెంట్లు వాయిదా పడిన టెన్షన్ పడకూడదు. పెద్దల ఆరోగ్యం, ఆర్థికవిషయాలు, వృత్తిపరమైన విషయాలలో పెద్దల సహకారం మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి మిత్రుల సహకారంతో నూతన అవకాశాలు, ప్రారంభాలు ఆలోచనలు చేస్తారు. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు, పెద్దల సహకారం, ఉన్నత విద్య అంశాలు అనుకూలంగా ఉంటాయి.దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు అవకాశాలు లభ్యమవుతాయి అవి ఆనందాన్ని ఇస్తాయి. చివరిలోఎదురుచూసిన విషయాల్లో కొంత మంచి ఫలితాలు ఆనందాన్నిస్తాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
వారం ప్రారంభంలో ఫలితాంశములు గమనించగా గౌరవం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు, మాట విలువ చాలావరకు అనుకూలంగా ఉంటాయి, వృత్తి పరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది, భాగస్వామ్య వ్యవహారాలు, ఆర్థిక అంశాలలో వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్వేగాలని అధిగమించాలి. వారం మధ్యలో వాగ్దానాలు చేస్తే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిలో వ్యక్తుల సహకారం మిశ్రమం. రావలసిన ధనము సమయానికి అందకపోవడం వల్ల ప్రశాంతత తక్కువగా ఉంటుంది. చివరిలో విద్యా,విదేశీ వ్యవహారాల్లోనూ, వృత్తిపరంగా ప్రయాణాలకు అవకాశం. తండ్రి ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత వైద్య విషయాలలో నిర్లక్ష్యము తగదు. కమ్యూనికేషన్ విషయాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. శ్రీకృష్ణుని ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
వారం ప్రారంభంలో ఫలితాంశములు గమనించగా మీ నిత్యజీవితంలో మానసిక ఆరోగ్యం పెంపొందించుకునే విధంగా కృషి చేస్తారు యోగా మెడిటేషన్ మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకుంటారు అవే మీకు మానసిక ప్రశాంతతను చేకూరిస్తాయి. బంధు వర్గంతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి మీయొక్క దినచర్యలోమార్పులు చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తారు .ఆరోగ్యమునకు సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. వారం మధ్యలో స్నేహ సంబంధాల విషయంలో శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేసుకోవడానికి ఆరాట పడతారు. సంఘంలో గుర్తింపు గౌరవం, మాట విలువ మీ సహాయ సహకారాల కొరకు తమ అవసరం కోసం వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు. ముఖ్యంగా సోదర వర్గంతో చర్చలు చేసేటప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో సంతానంతో కలిపి ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శన ఆనందాన్నిస్తుంది. వారం చివర్లో సంతానంతో, వృత్తి సంబంధిత అంశాలలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్య, మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విషయాల్లోనూ, అనవసరమైన వ్య్యయములను తగ్గించుకునే అంశాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది.
సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)
వారం ప్రారంభంలో ఫలితాంశములు గమనించగా సంతాన సంబంధమైన విషయాల కొరకు ఉపాసనని పెంచుకునే దిశగా ఖర్చులు అధికంగా ఉంటాయి అవి మానసిక ప్రశాంతతను పెంపొందించే విధంగా ఉంటాయి.దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఇష్ట పడిన వ్యక్తుల కొరకు విందు వినోదాల కొరకు, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వారము మధ్యలో పూర్వ రుణములు తీరుస్తారు, న్యాయ సంబంధమైన అంశములు ఆరోగ్య విషయాలు శ్రద్ధ. నిత్య జీవిత దినచర్యలో మార్పులు చేస్తారు. చివరిలో భూ సంబంధమైన అంశాలు కొనుగోలు, అమ్మకాలు మొదలైన విషయాలలో నూతన వ్యక్తులను నమ్మడం గానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం గానీ కొంత జాగ్రత్త తీసుకోవాలి.విదేశీ వ్యవహారాలు దూర ప్రదేశాలలో విస్తరణ, భాగస్వామ్య వ్యాపారాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యులకు మీ సహకారాన్ని అందిస్తారు. ఆకర్షణీయంగా మాట్లాడి పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచిది.
కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)
వారం ప్రారంభంలో ఫలితాంశములు గమనించగా ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. సంతానం యొక్క అభివృద్ధి, విందు వినోదాలు, ఆత్మీయ వ్యక్తుల కలయిక, ఉపాసన మొదలైన విషయాలు మీకు ఆనందాన్నిస్థాయి. స్నేహితుల యొక్క సహకారం బాగుంటుంది పోటీలలో నెగ్గుతారు. విద్యాపరమైన విషయాలు గృహ వాహన విషయాలు అనుకూలము. బంధు వర్గంతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామి యొక్క అభివృద్ధి, ప్రియమైన వ్యక్తులతో ఒక చక్కని నిర్ణయానికి వస్తారు. వారం చివరిలోభాగస్వామి యొక్క సహకారం ఆనందాన్నిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచన ఆనందాన్ని ఇస్తుందిమీ దగ్గర రుణములు తీసుకున్న వారి చెల్లిస్తారు, శత్రు రోగ ములపై విజయం సాధిస్తారు. కృషితో శ్రమతో అనుకున్న పనులు సాధన. రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. వృత్తిపరమైన విషయాలలో ప్రత్యర్థులన్ని ఓడించి శ్రమతో ముందుకు వెళతారు. నరసింహ స్వామిఆరాధన మంచిది.
తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
వారం ప్రారంభం స్థిర నిర్ణయాలు, దగ్గర ప్రయాణాలు, వృత్తిపరమైన విషయాలలో పనులు సాధన. వృత్తి ప్రదేశాలలో తోటి వ్యక్తుల యొక్కసహకారాన్నికోరకుండా పనులు సాధించుకోవడానికి వ్యక్తిగతంగా మీరు చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క గౌరవం విలువలు పెరుగుతాయి ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ఆర్థిక అంశాలు చర్చగా ఉంటుంది. తండ్రి పెద్దల సహకారంతో, సమయస్ఫూర్తితో, ఆర్థిక విషయాలలో సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్తారు. వీలైనంత వరకు పరిచయం లేని వ్యక్తులతో ఘర్షణ, ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వృత్తిపరంగా విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళతారు. మానసిక ఆందోళనను అనవసర ఆలోచనలను అధిగమించాలి. వారం మధ్యలోభాగస్వామి ఆరోగ్య, సంతాన వర్గం అభివృద్ధి కొరకు, ఖర్చు చేస్తారు. ఆత్మీయులతో మంచి సమయాన్ని గడుపుతారు.గృహ వాహన కొనుగోలు కొరకు లోన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, విద్యాపరమైన విషయాలలో రాత నైపుణ్యాలు పెంచుకోవాలి. గృహ సౌఖ్యం లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలు మేలు.
వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
ప్రారంభం ఫలితాంశములు గమనించగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మాట గౌరవాన్ని పెంపొందించుకునే ముందుకు వెళ్లాలి. పంతం పౌరుషం పెరుగుతాయి, వారసత్వపు ఆస్తుల ఆలోచనలు అధికంచేస్తారు.అయినప్పటికీ స్వ శక్తితో అన్నిటా లాభాలతో ముందుకు పెడతారు విద్యా విషయాలు, దూర ప్రయాణాలు, తండ్రి పెద్దల సహకారం మొదలైన విషయాలలో మాటల వల్ల గౌరవం తగ్గకుండా చూసుకోవాలి, వారం మధ్యలో వ్యక్తుల సహకారం బావుంటుంది, స్థిర నిర్ణయాలు నూతన విషయాలు, శక్తి సామర్థ్యాలను కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళతారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం. ముఖ్యంగా కుటుంబముతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆకస్మికంగా ఉంటాయి.ఆత్మీయులు సహకారంతో నిర్ణయాలు తీసుకుంటారు. గృహ సౌఖ్యం కొంత తక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేవారు, ముఖ్యంగా స్థిరాస్తులని నిర్ణయించుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి. ఆదిత్య హృదయ పారాయణ, నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది.
ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
ఈవారం ప్రారంభం అంశాల్ని పరిగణిస్తే ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానంతో భాగస్వామితో కమ్యూనికేషన్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి. దీర్ఘకాలికి పెట్టుబడులు వ్యవసాయ భూముల కొరకు ఆత్మీయులతో చర్చించి కొనుగోలు కొరకు ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు.ఆకస్మికంగా సమయానికి ధనం అందుబాటు అవ్వడం వల్ల కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గౌరవాన్ని పెంపొందించు కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేయడం వల్ల బంధుమిత్రులలో పెద్ద మనిషిగా గౌరవం పొందుతారు. వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో సహకారం మిశ్రమ ఫలితాలు. విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక ఆనందాన్నిస్తుంది. వారం చివరిలో పరాక్రమం పెరుగుతుంది అయినప్పటికీ ముఖ్యలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. వృత్తిమీద అధిక శ్రద్ధతో ముందుకు వెళతారు. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ గృహ వాహన సౌఖ్యాల కొరకు ఖర్చులు అధిక చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. పాత ఇంటిని రిపేరు చేయడం కొరకు ప్రయత్నం చేస్తారు. విద్యాపరంగా నూతన విషయాలు తెలుసుకుంటారు.మంచి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణం మంచిది.
మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)
వారం ప్రారంభం జీవిత భాగ స్వామితో కలసి దూర ప్రయాణాలు విదేశీ వ్యవహారాల కొరకు చర్చలు అవకాశాలు. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొరకు, లేదా ఆనందము షాపింగ్ కొరకు ఖర్చులు అధికం చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతాయి. సహోదరులకు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల ఆత్మీయతను అభిమానాలను పెంపొందించుకుంటారు. మధ్యలో ధైర్యం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వృత్తిలో నిర్ణయాలు బావుంటాయి. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వారం చివరిలో తోబుట్టువులతో దీర్ఘకాలిక చర్చలు, ఆత్మీయ వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తపడాలి. నాయకత్వ లక్షణాలు ఆర్థిక, భూ సంబంధ, వాహన అంశాలు అత్తమామలతో అనుకూలతలు. తోబుట్టువులతో దీర్ఘకాలిక చర్చలు, ఆత్మీయ వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్తపడాలి. నాయకత్వ లక్షణాలు అయినప్పటికీఉద్వేగాలను అధిగమించాలి. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ ఆరాధన మంచిది.
కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభం ఫలితంశములు గమనించగా విద్యార్థులు పోటీలలో నెగ్గుతారు ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు దూర ప్రయాణాలకు అవకాశం. నిద్రలేమి అనవసర ఖర్చులు మొదలైనవి అధిగమించాలి. ఆరోగ్య తగిన శ్రద్ధ తీసుకోవాలి. అనవసర పెట్టుబడుల కొరకు రుణములు చేయడం వల్ల గౌరవం తగ్గే అవకాశం ఉంది కాబట్టి రుణములు చేసే ముందు జాగ్రత్త అవసరం. వారం చివరిలో వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి, జాగ్రత్తగా వ్యవహరించి గాసిప్పులకు దూరంగా ఉంటూ, ఉన్నత అధికారులతో గౌరవంగా పనిని ముగించుకోవాలి. కొన్ని సందర్భాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల, మాటల వల్ల వారాంతంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులను అధిగమిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి నరసింహ స్వామి స్తోత్రాలు వినడం, నరసింహ ఆలయ దర్శనం మంచిది.
మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
వారం ప్రారంభం ఫలితంశ ములు గమనించగా,వృత్తిపరంగా నూతన వ్యక్తుల పరిచయం. సంతాన అభివృద్ధి కరంగా ఉంటుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అధిక శ్రమ ఒత్తిడి ఉన్నప్పటికీ వృత్తిలో అభివృద్ధి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళుతుంది ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక విషయాలు ఉపాసన విందు వినోదాలు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తాయి. ప్రియమైన వారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అధిక శ్రమ ఉన్నప్పటికీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ వృత్తిపరమైన విజయ సాధన కొరకు బాధ్యతగా ముందుకు వెళతారు. భాగస్వామికి తాత్కాలిక స్థాన చలనానికి అవకాశం. భూ సంబంధమైన విషయాలు కొనుగోలు అమ్మకాలు, ఆర్థిక అంశాలు మొదలైన వాటిలో మోసములకు లోను కాకుండా వ్యయ ప్రయాసలకు దూరంగా ఉండాలి. ఆర్థిక, వృత్తి విషయాలలో భాగస్వామి తో చర్చించి ముందుకు వెళతారు. భాగస్వామి ఆరోగ్య, అభివృద్ధి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు మంచి ఫలితముల కొరకు దుర్గాదేవి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.
(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).
డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani
జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant
email : padma.suryapaper@gmail.com
www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa