మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)చతుర్ధ అధిపతి అయిన చంద్రుడు షష్ట సప్తమ అష్టమ నవమ స్థానంలో మీదుగా ప్రయాణం. అష్టమ స్థానములో బుధ శుక్ర యుతి. భాగ్య స్థానం లో రవి కుజ యుతి. తృతీయంలో గురుడు. ఫలితాంశములు గమనిస్తే వారం ప్రారంభంలో రోగ రుణాలను జయించడానికి ప్రయత్నం చేస్తారు. అసంతృప్తి అధికంగా ఉన్నప్పటికీ కూడా శత్రువుల మీద విజయం సాధిస్తారు కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి బహుమానాలు అందుకుంటారు భాగస్వామితో కలిపి చర్చలు చేస్తారు. ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ బెదములు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. విద్యాపరమైన విషయాలలో విద్యార్థులు డివియేషన్ లేకుండా తగిన జాగ్రత్తలతో ఉండాలి. వ్రాతనైపుణ్యాలను పెంచుకోవాలి. అధిక అధిక ఉద్వేగాలని, తొందరపాటు నిర్ణయాలని అధిగమించాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. గురువులు పెద్దల సలహా సహకారంతో విద్యార్థులు తగు జాగ్రత్తలతో విద్యా విషయాలలో ముందుకు వెళతారు. మరిన్ని మంచి ఫలితాలు కొరకు విద్యార్థులు శ్రీహయ గ్రీవాయ నమః జపం చేయడం మంచిది వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో) తృతియాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు పంచమ సప్తమ అష్టమ నవమ స్థానంలో మీదుగా ప్రయాణం, సప్తమ స్థానంలో బుధ శుక్ర యుతి. ద్వితీయంలో గురుడు, అష్టమంలో, రవి కుజ యుతి గ్రహగోచారాలను పరిశీలించగా వారం ప్రారంభంలో ప్రియమైన మిత్రులతో కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి, సంతానము విద్యా విషయాలు మీద దృష్టి సారించాలి. కుటుంబంలోని స్త్రీలతో అభిప్రాయ బెదములకు దూరంగా ఉండాలి. గృహ వాతావరణం కొంత అ సౌకర్యం. సామాజిక సంబంధాల విషయంలో, భాగస్వామి వ్యవహారాల్లో అహం సమస్యలకు దూరంగా ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో ఘర్షణలకు దూరంగా ఉండాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. అధిక కోపాన్ని నియంత్రించాలి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిదే. మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి) ద్వితీయాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభించి వారాంతం వరకు చతుర్ధ పంచమ ష ష్ట సప్తమ స్థానముల మీదుగా ప్రయాణం. సప్తమ స్థానంలో రవికుజ యుతి, షష్ట స్థానంలో బుధ శుక్ర, జన్మంలో గురుడు గ్రహగోచారాలను పరిశీలించగా, వారం ప్రారంభంలో తల్లి యొక్క ఆదాయం ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి కొరకు విద్యా అంశాల కొరకు శ్రద్ధ తీసుకుంటారు. గృహ వాహన విషయాలకు సంబంధించి రుణ సంబంధ అంశాలకు కొరకు గవర్నమెంట్లో ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లభ్యం. సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ. ఆకస్మికమైన ఖర్చులను అధిగమించాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి విద్యార్థులు చేసే ప్రయత్నాలు అధిక శ్రమ అనంతరం ఫలిస్తాయి. తోబుట్టువులతో అభిప్రాయ బేధము లకు దూరంగా ఉండాలి. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ బాధ్యతలు పెరుగుతాయి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో) రాశ్యాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభ మొదలు వారాంతం వరకు తృతీయ చతుర్ధ పంచమా షష్ఠ స్థానముల మీదుగా ప్రయాణం, షష్ఠ స్థానంలో రవికుజ యుతి, బుధ శుక్ర పంచమ స్థానంలో యుతి, వ్యయస్థానంలో గురుడు గ్రహగోచారాలు గమనించగా, వారం ప్రారంభంలో అధిక సామర్థ్యాలను ఉపయోగించి అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ ఆకస్మికమైన ఆటంకాలు, సిబ్బంది యొక్క సహకార లోపం, ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. సంతానవర్గం విషయంలో అసంతృప్తికి లోనవుతారు. ప్రియమైన వ్యక్తుల ప్రవర్తన తో ఇబ్బంది కలిగిస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. సంతాన వర్గం కొరకు అధిక ధనాన్ని వెచ్చించి విందు వినోదాలకు, షాపింగ్ వంటి కార్యక్రమాలకి వెళ్తారు. అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవాలి ఆలోచనలలో కోపాన్ని అధిగమించాలి. సంతానం యొక్క ప్రవర్తన, మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. మరిన్ని మంచి ఫలితాల కొరకు శరవణభవ నామాన్ని అని పటించుట మేలు సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే) వ్యయాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు ద్వితీయ తృతీయ చతుర్ధ పంచమ స్థానంలో మీదుగా ప్రయాణం, పంచమంలో రవికుజ యుతి, చతుర్దంలో బుధ శుక్ర యుతి, లాభంలో గురుడు గ్రహగోచారాలను గమనించగా ప్రారంభంలో కుటుంబ పరమైన అంశాలలో అధిక ఖర్చులు, మాట విలువ సామాన్యం, కుటుంబానికి బందు వర్గం రాక, చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలో అనుకోని సమస్యలు. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలను అభివృద్ధి, వాతావరణాన్ని అందముగా అలంకరించుకొనుటకు ప్రయత్నాలు చేస్తారు. తల్లితో చర్చించి గృహ వాహన విషయాల కొరకు నూతన ఆలోచనలు. ప్రియమైన మిత్రులతో సమావేశాలు చర్చలు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి ఆటంకాలు. మంచి ఫలితముల కొరకు సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచిది కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో) లాభాధిపతి చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు జన్మ ద్వితీయ తృతీయ చతుర్ధ స్థానములమీదుగా ప్రయాణం, చతుర్థ స్థానములో రవి కుజ యుతి తృతీయంలో బుధ శుక్ర యుతి, రాజ్యస్థానము లో గురుడు గ్రహగోచారాలను పరిశీలించగా మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది, చురుకుగా ఆలోచనలు చేస్తారు, దగ్గర ప్రయాణాలకు అవకాశం, కమ్యూనికేషన్ విషయంలో సమయస్ఫూర్తిని ఉపయోగిస్తారు, రైటింగ్ స్కిల్స్ ని పెంపొందించుకుంటారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, వృత్తిపరమైన విషయాలలో రావలసిన ఆదాయాన్ని పొందగలుగుతారు, తల్లి భాగస్వామి యొక్క సహకారం సమయానికి అనుకూలంగా ఉంటాయి, శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుంటూ అనుకున్న పనిని అనుకున్న సమయంలో సాధించడానికి తగిన కృషి చేస్తారు. స్థిరస్తులు గృహ వాహన విషయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. తోబుట్టువులతో అపార్థములకు దూరంగా ఉండాలి. మరిన్ని మంచి ఫలితములు కొరకు విష్ణు సహస్రనామాలు వినడం మేలు తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే) రాజ్యాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు వ్యయ, జన్మ, ద్వితీయ తృతీయ స్థానముల మీదుగా ప్రయాణం, తృతీయంలో రవి కుజ యుతి, ద్వితీయంలో బుధ శుక్ర యుతి, భాగ్య స్థానంలో గురుడు గ్రహగోచారాలను గమనించగా శ్రమ, పని భారం, అలసట ఒత్తిడికి గురిచేస్తాయి. కంటి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరంగా తీసుకున్న రుణములు ఏదైనా ఉంటే వాటిని చెల్లించడానికి ప్రయత్నం చేస్తారు. సంతాన వర్గం యొక్క విద్యకు సంబంధించిన విషయాలలో పూర్వము తీసుకున్న రుణముల విషయంలో కొంతవరకు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, యోగ మెడిటేషన్ ద్వారా. పూర్తిగా చమత్కారంగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి పెద్దల సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసర సమస్యలకి దూరంగా ఉండాలి. భాగస్వామి యొక్క సహకారం బాగుంటుంది వ్యాపార విస్తరణ కొరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సత్యనారాయణ స్వామి ఆరాధన మేలు వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు) నవమాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు లాభ వ్యయ జన్మ ద్వితీయ స్థానముల మీదుగా సంచారం, ద్వితీయ స్థానంలో రవికుజ యుతి , జన్మ స్థానంలో బుధ శుక్ర యుతి, అష్టమ స్థానంలో గురుడు గ్రహగోచారాలను గమనించగా చిన్ననాటి మిత్రులతో, దూర ప్రదేశాలలో ఉండే తండ్రి తరపు బంధువులతో చర్చలు, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. ఉండే వ్యక్తులతో అనుబంధాన్ని దించుకుంటారు సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం కలుగుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యా సంబంధ వస్తువులుకొనుగోలు. భాగస్వామితో వారసత్వ ఆస్తుల విషయంలో చర్చలు. వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది పై అధికారులతో ఇబ్బందులను అధిగమించాలి అనవసరమైన విషయాల వల్ల మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది, వృత్తిపరంగా అధిక శ్రమ, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, ఆహార స్వీకరణ విశ్రాంతి లోపం. మాటలు మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. అనవసర విషయాలలో జోక్యము చేసుకోకపోవడం మేలు. మరిన్ని మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే) అష్టమాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు దశమ లాభ వ్యయ జన్మస్థానం ల మీదుగా ప్రయాణం. జన్మములో రవి కుజ యుతి, వ్యయస్థానంలో బుధ శుక్ర యుతి, సప్తమ స్థానంలో గురుడు గ్రహగోచారాలను గమనించగా వృత్తి కి సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది, కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి, కొలీగ్స్ తో అనవసరమైన వివాదాలు దూరంగా ఉండాలి. భాగస్వామ్య వ్యవహారాలలో తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. అకారణముగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. లాభదాయకమైన ఆలోచనలను అమలుపరిచే విషయంలో తీవ్రంగా ఆలోచనలు చేస్తారు, విద్యార్థులు రాత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. మానసిక ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆశించిన స్థాయిలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారము లభ్యం కాలేదన్న విషయంలో ఒత్తిడిని అధిగమిస్తూ మీ పనులను స్వతంత్రంగా నిర్వహించుకుంటారు. ఉద్వేగాలను అధిగమించాలి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి) సప్తమాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు నవమ దశమ లాభ వ్యయస్థానముల మీదుగా ప్రయాణం, వ్య య స్థానంలోరవికుజ యుతి , లాభ స్థానంలో బుధ శుక్ర యుతి, షష్ఠ స్థానంలో గురుడు గ్రహగోచారాలను గమనించగా భాగస్వామితో కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, వారి యొక్క సహకారంతో అనుకున్న పనులను సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. సామర్థ్యాలు పెంపొందించుకుంటారు. జీవిత భాగస్వామికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు యొక్క, తండ్రి యొక్క సహకారం పెద్దల యొక్క ఆశీస్సులు అనుకున్న విధంగా అనుకున్న విధంగా ఉంటాయి. వృత్తిపరైన విషయాలలో అభివృద్ధి ఆదాయం మానసిక సంతృప్తిని ఇస్తుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వ్యాపార విషయాల్లో మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువులు సైతం అనుకూలంగా ఉంటారు. కృషి శీ లత నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. నూతన వాహన గృహ నిర్మాణాల కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా) షష్ఠాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు అష్టమ నవమ దశమ లాభ స్థానముల మీదుగా ప్రయాణం, పంచమ స్థానంలో గురుడు, లాభ స్థానంలో రవి, కుజ యుతి. దశమ స్థానంలో బుధ శుక్ర యుతి, గ్రహగోచారాలను పరిశీలించగా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి, ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు, మానసిక ఒత్తిడిని అధిగమించాలి, కుటుంబ సభ్యులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి. వృత్తి చేసే ప్రదేశాలలో పై అధికారులలో ముఖ్యంగా స్త్రీలతో మాట పట్టింపులు రాకుండా వినయంగా ప్రవర్తించి సమయస్ఫూర్తిగా పనులు నిర్వర్తించుకోవాలి. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం లభ్యం కావటం లేదు వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో అనుకున్న భావాన్ని చికాకుల్ని అధిగమించాలి. తల్లి తండ్రి యొక్క సహకారం సామాన్యంగా ఉంటుంది, అధిక శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కృషి చేస్తూ వృత్తిపరమైన విజయాల కొరకు నిరంతరం శ్రమిస్తారు. అసంతృప్తిని అధిగమించాలి. వృత్తి చేసే ప్రదేశాలలో అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. ఉన్నత అధికారులు, తోబుట్టువుల యొక్క సహకారంతో కొంతవరకు అనుకున్న పనులని, ఆగుతూ వచ్చిన విషయాలని సాధించగలుగుతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు ఆదిత్య హృదయ పారాయణ మేలు. మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి) పంచమాధిపతి అయిన చంద్రుడు వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు సప్తమ అష్టమ నవమ దశమ స్థానం ల మీదుగా ప్రయాణం, దశమ స్థానంలో రవి కుజ యుతి. నవమ స్థానంలో బుధ శుక్రవారం. చతుర్ధములో గురుడు గ్రహగోచారమును పరిశీలించగా సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది, స్నేహ సంబంధాలను ఉన్నతంగా పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు అవసరం. కమ్యూనికేషన్ విషయంలో శ్రద్ధ చూపించాలి. మధ్యలో ముఖ్యమైన పనులు, ప్రయాణాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు, దీర్ఘ కాలికి పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ఆలస్యాలు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది, మానసిక ప్రశాంతత అని పెంపొందించుకోవాలి, వ్యాపార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసంతృప్తిని అధిగమించాలి పుణ్యబలాన్ని పెంపొందించుకోవాలి తండ్రి ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవాలి. వారాంతంలో వృత్తిపరమైన విషయాలలో పెద్దల యొక్క సహకారం, ఆర్థికంగా అనుకూలం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మరిన్ని మంచి ఫలితాల కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన మేలు. (గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు). డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant email : padma.suryapaper@gmail.com www.padmamukhi.com
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa