జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, కోనేటి ఆదిమూలంతో పాటుగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్టేజ్ ఎక్కి అశ్లీల డ్యాన్సులు చేస్తున్నా్రంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో పాటుగా జబర్దస్త్ కమెడియన్ శాంతిస్వరూప్ కూడా స్పందించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో డ్యాన్స్ వేసింది తానేనంటూ కమెడియన్ శాంతి స్వరూప్ ఓ వీడియో విడుదల చేశారు.
" నమస్కారం జగన్ గారూ.. మీరంటే నాకు అభిమానం ఉండేది. అమ్మాయిలతో అశ్లీలంగా డ్యాన్స్ వేసిన మంత్రి అని అన్నారుగా. అది నేనే. మీకు నేను తెలియకపోవచ్చు, కానీ మీ కార్యకర్తలలో కొంతమందికి అయినా నేను తెలిసి ఉండొచ్చు. మీ షోలు కూడా నేను చేశా. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు నేను తెలుసు. మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేముందు కనీసం వారిని అడిగినా నేనెవరో చెప్పేవారేమో.. మీరు నిజానిజాలు తెలుసుకోకుండా లేడీస్‌తో అశ్లీలంగా మంత్రి అనేశారు. సంక్రాంతి పండుగ రోజు రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు.. హైపర్ ఆది టీమ్‌ను పిలిచారు. దానిలో భాగంగా మేమంతా టీమ్‌గా వెళ్లాం. "
"జనాలను ఎంటర్టైన్ చేయడానికి డ్యాన్సు, స్కిట్లు వేస్తాం. అందులో భాగంగా మంత్రి సుభాష్‌ను మాతో పాటూ రెండు స్టెప్పులు వేయమని మేము బలవంతం చేశాం. కళాకారుల మీద గౌరవంతో ఆయన కాదనలేక వచ్చి డ్యాన్స్ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే నాతో ఆయన డ్యాన్స్ చేయలేదు. నేనే ఆయన దగ్గరకు వెళ్లి రెండు స్టెప్పులు వేశా. దాన్ని మీరు రికార్డింగ్ డ్యాన్స్ అంటూ అందరినీ బ్యా్డ్ చేస్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ అంటే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తే అంటారు. అదీ రికార్డింగ్ డ్యాన్స్. వేలమంది మధ్యన చేస్తున్న సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం. "
లేడీస్‌కు, లేడీ గెటప్‌కు తేడా తెలియదా..
"అక్కడున్నవారిని ఎంటర్టైన్ చేసేందుకు మంత్రి సుభాష్ రెండు స్టెప్పులు వేస్తే.. దానిని ఇంత ప్రచారం చేశారు. దీనివల్ల వారినే కాదు, కళాకారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈవెంట్ల ద్వారానే మేము బతుకుతున్నాం. మీరు అన్న మాటలతో మాపై తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. మీరు పెద్దవారు.. అది ఆలోచించకుండా ఇలా మాట్లాడటం సరికాదు. ఆ కార్యక్రమం మూడు రోజులు విజయవంతంగా జరిగింది. అది ఓర్వలేక మీ వాళ్లు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు.
"నన్ను లేడీ గెటప్‌గా జనం చూస్తుంటారు. అందుకే ఆ కార్యక్రమానికి లేడీ గెటప్‌లో వెళ్లా. మీరు అలా మాట్లడటానికి ముందుకు అసలు విషయం కనుక్కొని మాట్లాడి ఉంటే బాగుండేది. లేడీకి, లేడీ గెటప్‌కు తెలియకుండా నువ్వెలా సీఎం అయ్యావ్ అని కామెంట్లు పెడుతున్నారు. అది చూసి నాకు బాధేస్తోంది.. నేను మీకు చెప్పేంత మనిషిని కాదు. నా బాధను అర్థం చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నా. మీ వాళ్లు ఇంతకుముందు డ్యాన్స్ చేశారుగా.. వాటిని, వీటిని పక్కనపెట్టుకుని చూడండి.. మీకు అర్థమవుతుంది. " అంటూ కమెడియన్ శాంతిస్వరూప్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa