భరతదేశంలో ని అన్నిప్రాంతాలనుండి వేలాది భక్తులు, యాత్రీకులు ప్రతీరోజూ రామేశ్వరాలయాలను , ధనుష్కోటి ని దర్శించి పూజలు చేస్తూంటారు.రమేశ్వర పుణ్యక్షేత్రం ఆవిర్భవించి పది చతుర్యుగాలైనవని చెపుతారు. పదిహేను ఎకరాల విస్తీర్ణత కల ఈ ఆలయంలోని కొన్ని భాగాలు 49 అడుగులు పొడవుగలఏక శిల తో నిర్మించబడినవి. శరీ రామునిచే ప్రతిష్టించబడిన శివ లింగం, హనుమంతుడు
ప్రతిష్టించిన లింగం, విశాలాక్షి, పర్వత వర్ధని, నటరాజ స్వామి కిఈ ఐదు దేవతామూర్తులకు విమానములు నిర్మించబడి వుండడం విశేషం.పంచమూర్తుల ఊరేగింపు సమయంలో నంది తన వెనుక వేపు చూపకుండా స్వామిని చూస్తూ ముందువైపుకివెళ్ళడం ఆచారం.
రమేశ్వరంలోని జ్యోతిర్లింగాన్ని విభీషణుడు ప్రతిష్టించాడు. ఈ శివలింగం వెనుకభాగంలో కర్పూర హారతి వెలిగిస్తేముందువైపున లేత ఎరుపు జ్యోతి కనిపించడం విశేషం.ఈ జ్యోతిర్లింగం , జ్యోతిర్లింగాల క్షేత్రాలలోలో , ఏడవదిగా చెప్తారు. శరీ రామనాధస్వామికి , యితర దేవీ దేవతా మూర్తులకు అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలుమొదలైన పూజా విధానాలను నిర్వహించడానికి కన్ని శతాబ్దాల కాలంగా మహారాష్ట్ర బ్రాహ్మణులునియమించబడుతూవున్నారు.
జయేష్ట మాసంలో ప్రతిష్టాపనోత్సవాలు , జ్యేష్టమాసంలో కళ్యాణోత్సవం , మాఘ మాసం మహాశివరాత్రి ఉత్సవాలురమేశ్వరాలయంలోప్రసిధ్ధిచెందిన ఉత్సవాలు.
అమావాస్య , పౌర్ణమి రోజుల్లో సేతు సముద్రం అడుగున వున్న మూలికలు సముద్ర మట్టానికి పైకి వచ్చి ఒడ్డుకు చేరుతాయని, శాస్త్రవేత్తలు చెప్తున్నారు.అదే కాకుండా , రామేశ్వర సేతు సముద్ర తీర్ధం రెండు లక్షల మైళ్ళు ప్రదక్షిణం చేసివస్తాయని లెక్క కట్టారు. రమేశ్వర ఆలయం లోనిఒక్కొక్క తీర్ధం జీవశక్తులు , అయస్కాంత ప్రకంపనలు కలిగి వున్నాయి.ఆ పుణ్య తీర్ధం తో తలారా స్నానం చేస్తే ఆ శక్తులను మనం సంపూర్ణంగా పొందగలమని చెపుతారు.రమేశ్వర ఆలయంలో ఒకే శంఖంలో , రెండు శంఖాలున్న దైవీకమైన త్రిశంఖు వున్నది.రమనాధేశ్వరుని అభిషేకానికే ప్రత్యేకంగా1008 అభిషేక శంఖాలు వున్నాయి.
రమేశ్వరాలయ గర్భగుడిలోని మూల విరాట్ ను స్పర్శించి పూజించే అధికారంకంచి పెరియవర్ కి, శృంగేరి మహా సన్నిధానానికి, నేపాళ దేశపు రాజుకి మాత్రమేవుంది.రమేశ్వర ఆలయ నిర్మాణానికి , లంక లోని త్రికోణమలై నుండి బ్రహ్మాండమైన నల్ల రాళ్ళు
తీసుకు రాబడ్డాయి. రమేశ్వర ఆలయానికి సేతుపతి రాజులు చేసిన సేవలను గౌరవించే విధంగా, ఈ నాటికీ వారి నామ,నక్షత్రాలు మూలమూర్తికి పూజలు చేసే సమయంలో సంకల్పంలో పఠిస్తారు . ఈ సేతుపతులు శ్రీరామచంద్రునికి సహాయ పడిన గుహుని వంశం వారుగా చెప్తారు. రమేశ్వరం నటరాజ స్వామి సన్నిధిలో వున్న పతంజలి మహర్షి సమాధి వద్ద నేతి దీపం వెలిగించి ప్రార్ధనలు చేస్తే రాహు కేతు దోషాలు తొలగి పోతాయి. ఈ ఆలయంలో వైష్ణవాలయాలలో ఇచ్చినట్లు తీర్ధ ప్రసాదాలుఇస్తారు.కశీలో మరణిస్తే ముక్తి, శివలింగాలు కలిగిన నర్మదానదీ తీరాన వ్రతాలు చేస్తే ముక్తి, కురు క్షేత్రం లో దానాలుచేస్తే ముక్తి . కనీ , యీ పుణ్యఫలాలన్నీ యిచ్చే క్షేత్రం గా శ్రీరామేశ్వరం ప్రసిద్ధి చెందినది.
పతృదేవతలకు తర్పణాలు వదలనివారికి , భార్య గర్భిణియైన సమయంలో భర్తకి , యీ ఆలయంలోని తీర్ధాలలో స్నానం చేసేఅర్హత లేదు. సతు తీర్ధంలో స్నానం చేయ వచ్చును. తీర్ధమే దైవమైనందున స్నానం చేయడానికి దినం , తిధి, వార,నక్షత్ర, ప్రాతఃకాల, సాయంకాల, నిశా నియమ నిబంధనలు లేకుండా సేతు స్నానం చేయవచ్చును.కశీకి యాత్రతో యాత్ర పరిపూర్తి అయినట్లు కాదు. మొదట రామేశ్వరం వెళ్ళి, సముద్రస్నానం చేసి, అక్కడి సముద్రపు ఇసుకను తీసుకుని, కాశీకి వెళ్ళి అక్కడ గంగానదిలో కలపాలి. తిరిగి రామేశ్వరం వచ్చి , కాశీ నుండి తెచ్చిన గంగతో రామనాధేశ్వరుని అభిషేకించాలి.
అప్పుడే కాశీ యాత్ర పూర్తి అయి సత్ఫలితాలను యిస్తుందని ఐహీకం.కశీ క్షేత్రం ముక్తి ని ప్రసాదిస్తుంది. రామేశ్వరం, భోగాన్ని, ముక్తిని కూడా అనుగ్రహించే పుణ్యక్షేత్రం.శరీరామనాధేశ్వరాలయం తమిళనాడు రామనాధపురం జిల్లా దక్షిణం వైపు చివరన వున్న రామేశ్వర దీవిలోఉత్తర భాగాన వున్నది. రమేశ్వర క్షేత్రం మదురై నుండి 100 మైళ్ళు, రామనాధపురం నుండి 33 మైళ్ళ దూరంలో వున్నది..