టీ20 ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడుతోంది. ఈ పర్యటనలో భాగంగా నేడు తిరువనంతపురం తొలి టీ20 ఆడనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా, సఫారీలపై కూడా అదే ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో రోహిత్ సేన జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నందున అతని స్థానంలో విరాట్ కోహ్లీని ఆడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని రోహిత్ శర్మ ఇటీవల చెప్పడంతో, తుది సన్నాహకానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. అదే నిజమైతే.. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కోహ్లీ ఓపెనింగ్‌ను అభిమానులు వీక్షించే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ కూడా ఇందుకు మరో కారణం. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో, మొదటి T20లో హాఫ్ సెంచరీ మినహా, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 1 మరియు 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో కోహ్లీని ఉపయోగించుకోనున్నాడు కెప్టెన్ రోహిత్. అంతేకాదు టీమ్ ఇండియాకు రిజర్వ్ ఓపెనర్ లేకపోవడంతో కోహ్లినే జట్టుకు ప్రత్యామ్నాయంగా చూస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఇప్పటికే ఈ సిరీస్‌కు దూరంగా ఉండటంతో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరూ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రవిచంద్రన్ అశ్విన్‌కు దక్షిణాఫ్రికాపై ఆ అవకాశం దక్కవచ్చు.
ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇతర బౌలర్లతో ప్రయోగాలు చేసేందుకు రోహిత్‌కి ఇదే చివరి అవకాశం. గాయం నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో సిరీస్ కు అందుబాటులోకి వచ్చిన హర్షల్ పటేల్ రాణించలేకపోయాడు. అతను తన ఫామ్‌ను తిరిగి పొందాలి. అయితే అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా నిలకడగా ఆడడం భారత్‌కు ప్లస్ పాయింట్. యజువేంద్ర చాహల్ మంచి ప్రదర్శన చేయాల్సి ఉంది. మరోవైపు యువ బౌలర్ అర్షదీప్ సింగ్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.
జట్ల అంచనా:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్.
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, రిలే రసో, ఎయిడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, తెంబా బవుమా(కెప్టెన్), కగిసో రబాడా, కేశవ్ మహారాజ, ఆన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, టబ్రైజ్ షంసీ.