ఇటీవల సీఎం జగన్ కోనసీమలో వరద బాధితులను పరామర్శించేందుకు పర్యటించడం తెలిసిందే. ఈ సందర్భంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనీ అనే చిన్నారి పరిస్థితిని ఆమె తల్లితండ్రులు ప్లకార్డు ద్వారా ప్రదర్శించిన సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. ఎంతో అరుదైన 'గాకర్స్' వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న సీఎం జగన్ చలించిపోయారు. చిన్నారి వైద్యచికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ... తాజాగా, ఆ బాలిక వైద్యానికి రూ.1 కోటి మంజూరు చేశారు. ఈ మేరకు అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో హనీ తల్లిదండ్రులకు BRఅంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు.CMఆదేశాలతో అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.బాలిక కుటుంబానికి నెలకు రూ.10వేల పెన్షన్ కూడా మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.