కేంద్రం rrb పరీక్షలు జరపకుండా ఆలస్యం చేస్తున్న తరుణంలో విద్యార్థులు ఇప్పటికే ఎన్నో సార్లు నిరసనలు తెలియజేసారు. తాజాగా ఆదివారం మరోసారి రైలు రోకో నిర్వహించాలని తలిచారు. ఈ నేపథ్యంలో RRB ఆశావహులు తలపెట్టిన రైలు రోకో పురస్కరించుకుని జిల్లాలోని రైల్వే స్టేషన్ లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. రైళ్ల రాకపోకలకు, ప్రయాణీకులకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కల్గకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేసి నిఘా కొనసాగిస్తున్నారు.